సంక్షేమ ఫలాలు అర్హులకు చేర్చే బాధ్యత కలెక్టర్లదే..
అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు పేదలకు చేరాలి
ప్రభుత్వ లక్ష్యలు నెరవేరేలా కలెక్టర్లు కృషి చేయాలి
పథకాల ఫలితాలు అందేలా క్షేత్రస్థాయి చర్యలు
కలెక్టర్లకు మంత్రులు పొంగులేటి, పొన్నం, అడ్లూరి ఆదేశం
హైదరాబాద్(జనంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలని, ఆయా సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు చేరే విధంగా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్‌మణ్ కుమార్‌లు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం ఉదయం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు, విభాగాధిపతులతో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సవిూక్షించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, భూభారతి, వివిధ రెసిడెన్షియల్ స్కూళ్లలో భోజన, మౌలిక వసతుల ఏర్పాటు, వనమహోత్సవంలో మొక్కలు నాటడం, మహాలక్ష్మి పథకం తదితర అంశాలపై సవిూక్ష చేశారు. రాష్ట్ర మంత్రులు వివిధ అంశాల వారీగా జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు కలెక్టర్లు, అధికారులు నిర్విరామంగా కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు పొంగులేటి తదితరులు మాట్లాడుతూ ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని,క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్లు, అధికారులు ముఖ్య పాత్ర పోషించాలని, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఎన్నో పథకాల ఫలితాలను వారికి అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, దానికగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి ఆదేశాలకనుగుణం సాంఘిక, బిసి, మైనారిటీ- సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, హాస్టళ్లలో నిర్వాహణపై ఎప్పుటికప్పుడు తనిఖీలు నిర్వహించి వారంలో ఒక్కరోజు అధికారులందరూ ఆ హాస్టళ్లలో బస చేయాలని కలెక్టర్లను మంత్రులు ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లకు వీటి నిర్వాహణపై పలు సూచనలు చేశారు. పెంచిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా నాణ్యమైన భోజన వసతి కల్పించాలని ఆదేశించారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని, వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు రావొద్దని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్‌మణ్‌కుమారులు జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. హాస్టళ్ల ప్రాంగణాల్లో పచ్చదనం పరిశుభ్రతల్లో భాగంగా శానిటేషన్‌ను చేపట్టాలని, అన్ని జిల్లాల్లో ఎగ్ టెండర్స్ పక్రియను త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో నెలకోసారి పేరెంట్స్ కమిటీ విూటింగ్‌లను ఏర్పాటు- చేయాలని సూచించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా 200 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని, ఈ సందర్భంగా 97 బస్సు డిపోలు, 321 బస్‌స్టేషన్లలో వేడుకలను నిర్వహించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ లక్ష్యాల మేరకు అర్హ్గుªనై ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణంలో ఇసుక కొరత లేకుండా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని, ఇసుక రవాణాలో లబ్ధిదారుడినికి ఉచితంగా అందజేయాలని, ఇసుక రవాణా విషయంలో లబ్ధిదారునికి ఎలాంటి భారం కలుగకుండా చూడాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ప్రతి వారం దీనిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రగతిని సవిూక్షిస్తానని మంత్రి తెలిపారు. భూభారతిలో నమ్గోªనై దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యకార్యదర్శులు నదీమ్, ఎన్. శ్రీధర్, దానకిషోర్, నవీన్‌మిట్టల్, యోగితారాణా, క్రిస్టినా చొంగ్తూ, కార్యదర్శులు లోకేశ్‌కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్, విపి గౌతమ్, పిసిసిఎఫ్ సువర్ణ, ఇ.శ్రీధర్, సృజన, ఇతర అధికారులు పాల్గొన్నారు.
చేసిన పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలి
` ఏడాదిన్నరలో కొండంత చేసినా.. గోరంత చెప్పుకోలేకపోతున్నాం
` ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
` పెద్దఎత్తున కార్యక్రమాలపై ప్రచారం చేయాలి
` సమాచారశాఖ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష
హైదరాబాద్(జనంసాక్షి):ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఏడాదిన్నర కాలంలో ఎన్నోసంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ ముందుకు సాగుతున్నదని రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అయితే ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ చేసిన మంచి పనులను సవివరంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామని అభిప్రాయపడ్డారు. నేడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో చెయ్యనివాటిని చేసినట్లుగా గోబెల్స్ ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టిందని, ప్రతిపక్షంలో కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ ప్రజల కళ్లకు గంతలు కడుతోందని విమర్శించారు. తమ ప్రభుత్వం చేసినదాన్ని కూడా పూర్తిగా చెప్పుకోలేకపోతున్నామని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఐ అండ్ పిఆర్ స్పెషల్ కవిూషనర్ సిహెచ్. ప్రియాంక, ముఖ్యమంత్రి ప్రజాసంబంధాల అధికారి జి. మల్సూర్‌తో కలిసి మంగళవారం జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రి ఆలోచనలకు అనుగుణంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఏడాదిన్నరలో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఎంతోచేసినప్పటికీ ఆశించిన రీతిలో ప్రజలకు వివరించలేకపోతున్నామని అన్నారు. ఇచ్చిన హావిూలనే గాక ఇతర అంశాలలో ప్రజోపయోగపనులు చేపట్టామని , 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసి దేశంలోనే ఇంత భారీ నియామకాలు చేపట్టిన రాష్ట్రంగా తెలంగాణను అగ్రపధంలో నిలిపామన్నారు. ఇవేగాక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేదలకు సన్నబియ్యం, మహిళలకు రూ. 500లకే గ్యాస్ సిలిండర్, రైతుభరోసా పెంపు, రుణమాఫీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, డైట్ ఛార్జీలు 40 శాతం పెంపు,ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల పంపిణీ ఇలా రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ఎంతో చేశామన్నారు. గత ప్రభుత్వం పది సంవత్సరాలలో చేయలేనిది ఏడాదిన్నరలో చేసి చూపించాం. పది సంవత్సరాలలో పేదలకు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఆలోచన కూడా చేయలేదు. ఉన్న రేషన్ కార్డులలో పేర్లు కూడా నమోదు చేయలేదు. గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డుల్లో పేరునమోదు కోసం ఎదురు చూస్తున్న 15 లక్షల మంది పేదల పేర్లను రేషన్ కార్డులలో నమోదు చేశాం. కొత్తగా 7 లక్షల రేషన్ కార్డులిచ్చాం. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చాం. ఆర్ధికంగా ఎంతో ఇబ్బంది ఉన్నాకూడా పేదల సంక్షేమం విషయంలో ఈ ప్రభుత్వం రాజీ పడడం లేదన్నారు. ఈ ప్రభుత్వం తీసుకున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత జిల్లాస్ధాయిలో పౌరసంబంధాల శాఖ అధికారులదేనని ఈ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జాయింట్ డైరెక్టర్ జగన్ డిప్యూటీ డైరెక్టర్ మధు పాల్గొన్నారు.