ఈతకు వెళ్ళిన విద్యార్థి మృతి
కడప, జూలై 28 : పులివెందుల పట్టణంలోని నగిరిగుట్టకు చెందిన పదవతరగతి చదివే విద్యార్థి ఈతకు వెళ్ళి మృతిచెందాడు. నగిరి గుట్టకు చెందిన గంగాధర్(15) స్థానిక రవీంద్రనాథ్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం పాఠశాలకు సెలవు ఇచ్చారు. దీనితో గంగాధర్ వ్యవసాయపొలలో భావిలో ఈతకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. బాలుడు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అంతటా గాలించిన ప్రయోజనం లేకపోయింది. శనివారం ఉదయం భావిలో విద్యార్థి గంగాధర్ మృతదేహం నీటిపై తెలింది. దీనితో స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ సంఘటనపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.