ఈతకెళ్లి ఇద్దరు చిన్నారుల గల్లంతు

ఆదిలాబాద్‌, మే 12: చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు గల్లంతయిన విషాద ఘటన జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం రాంపూర్‌లో చోటుచేసుకుంది. వేసవి సెలవులు కావడం, ఎండలు మండిపోతుండడంతో చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. చిన్నారుల కోసం గ్రామస్తులు, అధికారులు చెరువులో గాలిస్తున్నారు.