*ఈనెల 12 న శెట్పల్లికి కేంద్ర బృందం రాక!
డిఆర్డిఎ పీడి సాయన్న
_________________________
లింగంపేట్ 08 అక్టోబర్ (జనంసాక్షి)
శెట్పల్లి గ్రామంలో ఉన్న పురాతన బావిని సందర్శించేందుకు కేంద్ర బృందం ఈ నెల 12 న వస్తున్నట్లు డిఆర్డిఎ పీడి సాయన్న తెలిపారు.ఆయన శనివారం లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామంలోని శివాలయం మల్లికార్జున స్వామి టెంపుల్ ప్రాంతంలో ఉన్న పురాతన కోనేరు బావిని ఆయన సందర్శించారు.పురాతన బావి యొక్క ప్రాముఖ్యతను గ్రామస్తులతో తెలుసుకున్నారు.వీరి వెంట గ్రామ పెద్దలు గంగారెడ్డి, ఎంపిటిసి రూప్ సింగ్,సత్యనారాయణ,లక్ష్మరెడ్డి, పరంధాములు,కిష్టగౌడ్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.