*ఈనెల 19న జరిగే సిఐటియు మండల మహాసభను జయప్రదం చేయండి*
*సిఐటియు మండల కన్వీనర్ నీల రామ్మూర్తి*
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.ఈనెల 19న జరిగే నేరేడుచర్ల లో సిఐటియు మండల మహాసభలను జయప్రదం చేయాలని సోమవారం సిఐటియు మండల కన్వీనర్ నీల రామ్మూర్తి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా నీలా రామ్మూర్తి మాట్లాడుతూ వెల్ఫేర్ పోర్టులోని నిధులను కార్మికులకే ఖర్చు చేయాలని, ఆటో కార్మికులకు అడ్డాలు చూపాలని,భవన నిర్మాణ కార్మికులకు అడ్డాలో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు, నేరేడుచర్ల మున్సిపల్ ఆఫీస్ రోడ్డులో గల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆఫీసులో జరిగేమహాసభలకు,అన్ని రంగాల కార్మికులు హాజరుకావాలన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకురాలు కొండపల్లి వరలక్ష్మి,కోదాటి సైదులు,ఎస్ కే హఫీజ్, చిన్న శ్రీను,మీరా,శోభన్ బాబు,బాలు,సైదులు,రాజారాం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.