ఈనెల 24,25 తేదీలలో సిపిఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.  -నల్లు సుధాకర్ రెడ్డి

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి

కురివి ఆగస్టు -18
(జనం సాక్షి న్యూస్)

సిపిఐ పార్టీ నిర్మాణం,విస్తరణ,ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి ఈనెల 24,25  తేదీలలో మానుకోట పట్టణంలో జరిగే సిపిఐ రెండవ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి  నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.కురవి మండల కేంద్రం గురువారం సిపిఐ పార్టీ  కార్యాలయంలో కార్యవర్గ  సమావేశం జరగగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాల సమరశీల ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి క్షేత్రస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు సిపిఐ మహాసభలు నిర్వహిస్తుందని దానిలో భాగంగా ఈనెల 24న జరిగే బహిరంగ సభకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని 25న ప్రతినిధుల సభ ఉంటుందని అన్నారు.ఈ మహాసభలకు సిపిఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె సాంబశివరావు,తక్కల్లపల్లి శ్రీనివాస్ రావు హాజరవుతారని అన్నారు.దేశ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా స్వాతంత్ర లక్ష్యాలను విలువలను ప్రచారం చేయకుండా కేవలం ఆర్భాటాలతో దేశభక్తిని చాటుకోవడం రాజకీయ జిమ్మిక్కు అని అన్నారు.ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి కర్ణం రాజన్న,జిల్లా కార్యవర్గ సభ్యు  శ్రీనివాస్ గౌడ్,నాయకులు తురక రమేష్,బుడమ వెంకన్న,దూది కట్ల సారయ్య,ఉప్పలయ్య,మహేష్,అప్పాల వెంకన్న సిపిఐ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.