ఈనెల 29 న జరిగే దళిత జర్నలిస్టు ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి దళిత జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పి.వెంకటస్వామి


నాగర్ కర్నూల్ రూరల్: జిల్లా ప్రతినిధి జులై 15(జనం సాక్షి)
:జులై 15 )ఈనెల 29వ తేదీన ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిర్వహించే దళిత జర్నలిస్టుల ఫోరం ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా దళిత జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు పి. వెంకటస్వామి నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న దళిత జర్నలిస్టులకుపిలుపునిచ్చాడు.శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఆఫీస్ అవరణలో దళిత జర్నలిస్టుల ఫోరం ఆత్మ గౌరవ సభకుసంబంధించినకరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగాఆయనమాట్లాడుతూ దళిత జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని రక్షణ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పత్రికలో పనిచేస్తున్న ప్రింటు మరియు ఎలక్ట్రానిక్ లో ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న ప్రతి దళిత జర్నలిస్టులకు దళిత బందు పథకాన్ని అమలు చేయాలనిఆయనడిమాండ్చేశారు.ప్రింటర్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు డబల్ బెడ్ ఇల్లు, కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసే హెల్త్ కార్డులను మంజూరు చేయాలనిఆయనకోరారు.వచ్చే అక్రిడేషన్ కమిటీ సమావేశంలో అక్కడేషన్ కమిటీలో మెంబర్గా ఛాన్స్ ఇవ్వాలని,సీనియార్టీ ప్రకారంగా దళిత జర్నలిస్టులకు నామినేటెడ్ పోస్టులను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈనెల 29న ఉమ్మడి పాలమూరు జిల్లాలో దళిత జర్నలిస్టుల ఆత్మగౌరవ సభకు నాగర్ కర్నూల్ జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న దళిత జర్నలిస్టులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఔటా శ్రీనివాసులు,నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఔటా వెంకటేష్, దళిత జర్నలిస్టులు నాగన్న, పరశురాము,వంగూరి జయశంకర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

తాజావార్తలు