ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగింది : ఉత్తమ్
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ స్పందించారు. ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగినట్లు ఉత్తమ్ అనుమానం వ్యక్తం చేశారు. వీవీప్యాట్‌ల్లో స్లిప్‌లను కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. కూటమి అభ్యర్థులంతా రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. వీవీప్యాట్లను లెక్కించే వరకు పట్టుబట్టాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఎవరు ఓడిపోతారో టీఆర్ఎస్ నేతలు ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇదంతా ట్యాంపరింగ్‌ను బలపరుస్తున్నాయని ఉత్తమ్‌కుమార్ వ్యాఖ్యానించారు.