ఈ ఉదయం ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు

హైదరాబాద్‌ : మంత్రుల నివాస సముదాయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ఈ ఉదయం ముట్టడించారు. జూనియర్‌ లెక్చరర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి సమీప పోలీసు స్టేషనకు తరలించారు.