ఈ నెలలో తెలంగాణపై నిర్ణయం : ఆజాద్
న్యూఢిల్లీ : మరికొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి ఈ నెలలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి , కాంగ్రెస్ , రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్ తెలిపారు. పార్టీని వీడిన వారికి తెలంగాణ కంటే బంధువులు, కుటుంబ సభ్యులపై ప్రేమ ఎక్కువ అని విమర్శించారు. చాలాకాలంగా తెలంగాణ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహించామని చెప్పారు. పార్టీ వీడిన వారికి తెలంగాణపై మమకారం లేదని అన్నారు. కుటుంబ ప్రయోజనాల కోసమే పార్టీని వీడారని చెప్పారు. రాష్ట్రంలో ప్రాంతాల మధ్య సమన్వయం ఉండేలా అనేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు సీమాంధ్రకు చెందినా… ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతీయుడేనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు,