ఈ నెల 15 తర్వాత 5 జిల్లాల్లో నగదు బదిలీ

హైదరాబాద్‌ : సచివాలయంలో నగదు బదిలీ పథకంపై ఉన్నతస్థాయి సమీక్ష ముగిసింది. ఈ నెల 15 తర్వాత మొదటి విడతగా ఐదు జిల్లాల్లో నగదు బదిలీ పథకం అమలు చేయనున్నట్లు ఆర్థిక ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్‌ వెల్లడించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, చిత్తూరు , అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలు మొదటి విడతలో ఉన్నట్లు చెప్పారు. జులై 1 నుంచి రెండో విడతలో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.