ఈ నెల 16న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయండి : టిఎస్ పిఎస్ సి చైర్మన్ డాక్టర్ బి జనార్ధన్ రెడ్డి

 

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) అక్టోబర్ 12 : జిల్లాలో ఈ నెల 16న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని టిఎస్ పిఎస్ సి చైర్మన్ డాక్టర్ బి జనార్ధన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు.
బుధవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, చీఫ్ సూపర్డెంట్ లు, లైసన్, అసిస్టెంట్ లైజన్ అధికారులతో ఈ నెల 16న జరిగే గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా3.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటివరకు2.43 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్ లౌడ్ చేసుకున్నారన్నారు.
అభ్యర్థులు తమ హాల్ టికెట్లనుwww.tspsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని, అందులోని సూచనలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 16న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు ఉంటుందని, అభ్యర్థులు 2 గంటల ముందే ( ఉదయం 8.30)వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. గ్రూప్1లో తొలిసారిగా బయోమెట్రిక్ ఉంటుందని, అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి అన్నారు. ఉదయం10.15 గంటల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లను మూసి వేస్తారని, పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ తోపాటు ఒక ఐడిని ఒరిజినల్( ఆధార్ /పాన్ కార్డు/ ఓటర్ ఐడి/ ఎంప్లాయ్ ఐ డి/ డ్రైవింగ్ లైసెన్స్/ పాస్ పోర్ట్ ) తీసుకురావాలని అన్నారు.హాల్ టికెట్ పై ఫోటో/ సంతకం లేనిపక్షంలో వారు గెజిటెడ్ అధికారిచే ధృవీకరించిన మూడు పాస్ పోర్ట్ ఫోటోలు తీసుకురావాలని అన్నారు. అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతించే ముందు పరీక్ష వేదిక ప్రవేశద్వారం వద్ద పరిశీలిస్తారని, ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అభ్యర్థులు చెప్పుల మాత్రమే ధరించి రావాలని బూట్లకు అనుమతి లేదన్నారు. పరీక్ష కోసం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే అనుమతించబడుతుందని అన్నారు. వికలాంగుల అభ్యర్థులకు గ్రౌండ్ ఫ్లోర్ లోనే వసతి కల్పించాలని, అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్, ఓఎంఆర్ జవాబు పత్రంలో బుక్లెట్ సంఖ్య, వేదిక కోడ్ వేయాలన్నారు. సిరీస్ ఏ, బి, సి మరియు డి నుండి ఆరు అంకెల సంఖ్యకు మార్చబడిందని అన్నారు.
ఓఎమ్ఆర్ జవాబు పత్రంపై వైటనర్ / చాక్ పవర్ / బ్లేడ్/ ఎరేజర్ ఉపయోగించరాదన్నారు. పరీక్ష పూర్తయ్యేవరకూ అభ్యర్థులెవరూ పరీక్ష హాలు నుండి బయటకు వెళ్ళకూడదని అన్నారు. పరీక్ష కేంద్రాలు, చుట్టుపక్కల ఫోటోస్టాట్ కాపీయింగ్ జిరాక్స్ సెంటర్లను మూసివేయాలన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టుప్రక్కల144 సెక్షన్ విధించాలన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరేందుకు అదనపు బస్సులు ఏర్పాటు చేయవలసిందిగా ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్ ను సూచించే బోర్డును ఏర్పాటు చేయాలనీ, త్రాగునీరు ఉండేలా చూడాలన్నారు.
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షను పగడ్బందీగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 4874 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని, వీరి కోసం 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 15 చీఫ్ సూపరిండెంట్లు, 5 లైసన్ ఆఫీసర్లు, 15 అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు, 15 ఫ్లయింగ్ స్క్వాడ్స్, లు నియమించడం జరిగిందని, చీఫ్ సూపర్డెంట్స్ రూమ్స్ లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ,ప్రాక్టిసింగ్ హై స్కూల్ లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు జరిగిందని తెలిపారు.
జిల్లా ఎస్ పి రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ లకు ఎస్కార్ట్ , పరీక్ష కేంద్రాలకు పూర్తి స్తాయి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. పరీక్ష కేంద్రాలకు వచ్చే అబ్యార్తులకు ఐ డి కార్డు చెక్ చేసి పంపిస్తామన్నారు. అదనపు పోలీస్ సిబందిని నియమిస్తామన్నారు. పరీక్ష రోజు 144 సెక్షన్ విదిస్తామన్నారు. ఎలాంటి సమస్య రాకుండా జిల్లా కలెక్టర్ కో ఆర్డినేషన్ తో పరీక్ష సజావుగా జరిగేటట్లు చూస్తామన్నారు.
వీడియో కాన్ఫరెన్సు అనంతరం చీఫ్ సూపరింటెండెంట్లు, లైసన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ లైసన్ అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి అబ్యార్తుల రావాలని, ఎంట్రెన్సు ముందే బయో మెట్రిక్ ఏర్పాటు చేయాలనీ, టిఎస్ పిఎస్ సి చైర్మన్ డాక్టర్ బి జనార్ధన్ రెడ్డి గారి సూచనల మేరకు ఏర్పాటు చేయాలనీ, మహిళల కు , పురుషులకు విడిగా టా యిలెట్స్ ను సూచించే బోర్డును ఏర్పాటు చేయాలనీ, త్రాగునీరు, లైటింగ్, ఫాన్స్, పూర్తి స్తాయి ఏర్పాట్లు చేయాలనీ అధికారులకు ఆదేశించారు. 16 నాడు ఉదయం నుండి సాయంత్రం 4 వరకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సంబందిత డి ఇ కి ఆదేశించారు. అన్ని మండలాల నుండి అబ్యార్థులు ముందే పరీక్ష కేంద్రానికి వచ్చేటట్లు ఆర్ టి సి అధికారులు చర్యలు తీసుకోవాలని, పరీక్ష కేంద్రాల లో మెడికల్ స్టాఫ్, మేడిసిన్స్ అందుబాటులో ఉంచాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా ఏ ఎస్ పి రాములు నాయక్, హిమ్మనేల్, ఆర్ డి ఓ,రాములు ,హృదయరాజు, చీఫ్ సూపరింటెండెంట్లు, లైసన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ లైసన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.