ఈ నెల 16న వ్యాసరచన పోటీలు.

తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం తాండూరు ఇంచార్జి జిలాని.
తాండూరు అగస్టు 13(జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం ఆద్వర్యంలో 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగ ఈ నెల 16న ఉదయం 11.30 ని॥ లకు స్థానిక చైతన్య కళాశాలలో భారత స్వాతంత్య్ర ఉద్యమంలో స్వతంత్రం కోసం పోరాడిన స్వతంత్ర ఉద్యమ నాయకుల పాత్ర”పై వ్యాస రచన పోటీని నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం జిలాని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రతి కళాశాల నుండి 6 మంది విద్యార్థుల ను వ్యాసరచన పోటీలకు పంపాలని
కళాశాల ప్రిన్సిపల్ లను కోరారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన విద్యార్థులకు ప్రముఖులచే బహుమతి ప్రధానం ఉంటుందని తెలిపారు.పూర్తి వివరాలకై పోన్ 9581696564 నంబర్ కు సంప్తదించ గలర ని విజ్ఞప్తి చేశారు.