ఈ నెల 22న ఇందుర్తి నూతన గ్రామపంచాయతీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభోత్సవం
జనంసాక్షి (చిగురుమామిడి) సెప్టెంబర్ 17:
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో 22 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ఈ నెల 22న గురువారం ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ అందే స్వరూప స్వామి తెలిపారు. శనివారం రోజున గ్రామపంచాయతీ పాలకవర్గంతో కలిసి నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనం పరిశీలించి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. దీనిని ఈనెల 22న స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో పాటు ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ గీకురు రవీందర్ తో ప్రారంభోత్సవం జరుపుకుంటామని సర్పంచ్ తెలిపారు.ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ తోట సతీష్, కార్యదర్శి వెంకటరమణారెడ్డి, నాయకులు అందే స్వామి, అందె చిన్నస్వామి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చింతపూల అంజయ్య, వార్డు సభ్యులు డాక్టర్ శ్రీను, సిరాజ్, ప్రభాకర్, తిరుపతి, లక్ష్మణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.