ఈ నెల 28 జరిగే కెమిస్ట్స్& డ్రగ్గిస్ట్ ల బంద్…. 

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది (సెప్టెంబర్ 27)

మందులను ఆన్లైన్ విధానంలో అమ్మటానికి,  ఈ ఫార్మసీ విధానాన్ని  తీవ్రంగా నిరసిస్తూ  ఆలిండియా కెమిస్ట్స్ లు  ఒక రోజు బంద్ నిర్వహిస్తున్నట్లు  కెమిస్ట్స్ & డ్రగ్గీస్ట్ సిద్దిపేట  జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు సత్యం తెలిపారు.  సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో గురువారం ఆయన  మాట్లాడుతూ ఆల్ ఇండియా  ఆర్గనైజేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ (AIOCD) భారతదేశంలోని అతిపెద్ద కెమిస్ట్స్& డిస్ట్రిబ్యూటర్  అసోసియేషన్ అన్నారు. మా ఆలిండియా అసోసియేషన్ మందులను  ఆన్లైన్ విధానంలో  అమ్మటాన్ని  తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు.  భారతదేశంలో ఇంటర్నెట్ ద్వారా మందులు అమ్మకం, ఈ ఫార్మసీస్ ద్వారా  ఏ రూపంలో అయినా మందులను ఆన్లైన్లో  అమ్మే  విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించే  విధానాలను వ్యతిరేకిస్తూ ఏ ఐ ఓ సి డి ఈనెల 28న బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఔసదా వ్యాపార నిర్వణలో  ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వాణిజ్య పరమైన నష్టమే  కాకుండా ఆన్లైన్ ఔషధాల అమ్మకానికి ప్రభుత్వం అనుమతిస్తే ప్రజా ఆరోగ్యానికి  హాని జరుగుతుందని అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలను నిలిపివేయాలని కోరారు. 28న జరిగే బంద్ ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకటేశ్వరరావు, కోశాధికారి సంజయ్, శీను, సిద్ధు,  అంబికా శ్రీను, లక్ష్మీ సాయి శ్రీను పాల్గొన్నారు.