ఈ నెల 9 నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా 75 కి.మి.ల మహా పాదయాత్ర
కోటగిరి ఆగస్టు 7 జనం సాక్షి:-కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రోజున మండల కేంద్రంలో బాన్సువాడ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కాసుల బాలరాజు అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ మీడియా సమావేశం లోకాసుల బాలరాజు మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోస్థవ్ పురస్కరించుకొని దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సం.కావస్తున్న నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పాలనను ఎండగడుతూ బాన్సువాడ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజక వర్గంలో 75 కి.మి పాటుగా మహా పాదయాత్ర నిర్వహిస్తున్నమన్నారు.బాన్సువా డ నియోజక వర్గంలోనీ కోటగిరి మండలం సుంకీని గ్రామంలో ఈ నెల 9 తేదీ నుండి 5 రోజుల పాటుగా నియోజక వర్గ వ్యాప్తంగా మహా పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.ఈ మహా పాదయాత్ర లో నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు
,సీనియర్ నాయకులు,కార్యకర్తలు,కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరు పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి కొట్టం మనోహర్,
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్,మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్,కోటగిరి పట్టణ అధ్యక్షులు అయుబ్, హన్మంత్రావ్ పటేల్,వహీద్,
ఆనంద్,సాయిలు,కార్యకర్తలు పాల్గొన్నారు.