ఈ నెల27 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న అంజలి యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ “ఝాన్సీ”

 

అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త వెబ్ సిరీస్ ఝాన్సీ. దర్శకుడు తిరు ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ట్రైబల్ హార్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మిస్తున్నారు. సైకలాజికల్ యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కిన ఝాన్సీ వెబ్ సిరీస్ ఈ నెల 27 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో అంజలి యాక్షన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో ఆకట్టుకునేలా స్టంట్స్ చేసింది. ఇందులో అబ్ రామ్, ఆదర్శ్ బాలకృష్ణ, సంయుక్త హార్నాడ్, చాందినీ చౌదరి, శరణ్య, రాజ్ అర్జున్, కళ్యాణ్ మాస్టర్, ముమైత్ ఖాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఝాన్సీ తెలుగు ట్రైలర్ ను తాజాగా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ విడుదల చేసింది. మనిషి జీవితంలో పెద్ద శిక్ష తనెవరో తనకు తెలియకపోవడం అంటూ మొదలైన ట్రైలర్ పలు సైకలాజికల్, యాక్షన్ షాట్స్ తో కొనసాగింది. నా ఫ్రెండ్స్ ఎవరో తెలియకున్నా ఫర్వాలేదు కానీ నా శత్రువు మాత్రం తెలియాలి అంటూ అంజలి చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ట్రైలర్ మొత్తంగా ఒక కంప్లీట్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను చూపించింది. ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ స్టంట్ కొరియోగ్రాఫర్ యనిక్ బెన్ ఝాన్సీ వెబ్ సిరీస్ లో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేశారు. అరవింద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.