ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని కేంద్ర మంత్రి ప్రకటన విడ్డూరం:కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బానోత్ రామునాయక్

*ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని కేంద్ర మంత్రి ప్రకటన విడ్డూరం:కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బానోత్ రామునాయక్*
*•కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుంటే తామే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్న కేటీఆర్ మాటలు ఏమాయే*
బయ్యారం, సెప్టెంబర్28(జనంసాక్షి):
విభజన చట్టంలో నిర్ధిష్టంగా హామీ ఇచ్చిన బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోత్ రాము నాయక్ అన్నారు. చట్టబద్దంగా ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ,తెలంగాణకు చట్టబద్దంగా రావాల్సిన బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం కొట్లాడి సాధించాల్సిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశ్రమ సాధ్యం కాదని చెప్పటం సిగ్గు చేటని ద్వజమెత్తారు.ముడి ఖనిజం క్వాలిటీ లేనందున ఉక్కు పరిశ్రమ పెట్టడం లేదనేది సాకు మాత్రమేనని అసలు ఖనిజమే లేని విశాఖ స్టీల్స్ 500 కి.మీ దూరం నుండి ఖనిజాన్ని, బొగ్గును, డోలమైట్ ను తెచ్చుకొంటూ లాభాలు గడిస్తుంటే అన్ని వనరులున్న బయ్యారంలో సాధ్యం కాదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కిషన్ రెడ్డి తన ప్రకటనను వెనక్కు తీసుకొని కేంద్రాన్ని ఒప్పించి బయ్యారం ఉక్కు పరిశ్రమను తీసుకు రావాలని, తెలంగాణ ప్రజల హక్కును హరించే విధంగా వ్యవహరించటం సరికాదన్నారు.మరోప్రక్క కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుంటే మేమే రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తుందని చెప్పిన రాష్ట్ర మంత్రి గారి మాటలు ఎటుపోయాయని గుర్తు చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఉక్కు పరిశ్రమ రాకుండా చేస్తున్నాయని,విభజన చట్టంలో ఉన్న హామిని అమలు చేయడంలో కేంద్రం ప్రభుత్వం విఫలమైతే దాన్ని సాధించుకోవడం చేత గాక పార్లమెంటులో పోరాడకుండా రోడ్లపై ధర్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలకు బుద్ది చేప్పే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.
Attachments area