ఉగ్గంపల్లి రెవెన్యూ సదస్సు రసాభాస

మరిపెడ: మండలంలోని ఉగ్గంపల్లిలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సభ రసాభాసగా మారింది. నెల రోజుల క్రితం ఆ గ్రామానికి చెందిన 25మంది రైతులు పాసుపుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నెల రోజులయినప్పటికి పాన్‌పుస్తకాలు ఇవ్వలేదని రెవెన్యూ అధికారులపై రైతులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు రావాల్సిన పాన్‌ పుస్తకాలను వెంటనే అందించాలని వారు పేర్కొన్నారు. ఈ సభలో తహసీల్దార్‌ షఫీవుద్దీన్‌, ఆర్‌ఐలు రహమాన్‌, సుధకర్‌నాయక్‌ పరిధ్‌బాబాలు ఉన్నారు.