ఉగ్రవాది దిష్టి బొమ్మ దహనం
మంగపేట: హైదరాబాద్ జంట బాంబు పేలుళ్లకు నిరసనగా శుక్రవారం మంగపేటలో సీపీఎం ఆధ్వర్యంలో ఉగ్రవాది దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి, నాయకులు ఎల్ పీ ముత్యాలు, ప్రసాదు, చిన్న, నరేష్, తదితరులు పాల్గొన్నారు.