ఉగ్రవాదులకు ఇది ఒక హెచ్చరిక : భాజపా
ఢిల్లీ: కసబ్‌కు ఉరిశిక్ష అమలుపై భాజపా హర్షం వ్యక్తం చేసింది. కసబ్‌ను ఉరితీయడం ఉగ్రవాదులకు ఒక హెచ్చరిక లాంటిదని భాజపా నేత ముక్తార్ అబ్బాన్ నక్వీ అన్నారు. వందలాది ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదికి ఉరిశిక్ష అమలు చేయడంలో ఆలస్యం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.