ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం

ప్రజల నుండి విశేష స్పందన
రామారెడ్డి    జనంసాక్షీ    సెప్టెంబర్ 11  :
ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించిన మధన్ మోహన ట్రస్ట్ వ్యవస్థాపకుడు  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామారెడ్డి నుంచి ఉచిత కంటి వైద్య సేవలకు  ప్రజల నుండి విశేష స్పందన లభించిందని సంతృప్తినిచ్చిందని చెప్పారు.
 ఇటువంటి సేవలు వృద్ధుల కోసం కంటిచూపు సమస్యలు ఉన్న వారి కోసం ప్రతి ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిదిలో గల ప్రతి మండలంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.  ఇట్టి శబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం ఐపిఎస్ పెంతకోస్తూ చర్చిలో ప్రార్థనలు చేశారు. ఈసందర్భంగా ఆయన  మాట్లాడుతూ,  భూమిని నమ్ముకున్న వ్యక్తి అసలైన లీడర్,  నాయకుడు అని కొనియాడారు.  ఈనాటి రోజుల్లో నాయకులే భూకబ్జాలకు పాల్పడుతూ,  ప్రజలను మోసం చేస్తున్నారని పంచాయతీలు పెట్టి పేద ప్రజల కడుపులు కొడుతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు . ఇటువంటి చేష్టలు అధికార నాయకులు పాల్పడడం వారికే చెల్లుతుందని అన్నారు.  మోసం చేసే వారికే ప్రజలు మద్దతు పలుకుతున్నారని గుర్తు చేశారు.  అటువంటి వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు.  అనంతరం మదన్మోహన్ చదివిన రామారెడ్డి  బాలుర పాఠశాలను తనిఖీ చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  జిల్లా పరిషత్ బాలుర పాఠశాలకు రెండు కోట్ల పైచిలుకు ప్రభుత్వం మంజూరు చేసిందని అట్టి నిధులను దుర్వినియోగ పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా పరిషత్ శిథిలావస్థలో ఉన్న భవనాన్ని  తొలగించి అత్యాధునికంగా జిల్లా పరిషత్ బాలుర పాఠశాలను నిర్మించి విద్యార్థులకు సౌకర్యవంతమైన విద్యను బోధించాలని అన్నారు.  లేనియెడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన, ధర్నా కార్యక్రమాలు స్కూల్ గ్రౌండ్లో చేపడతామని హెచ్చరించారు. ఈ  కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.