ఉచిత చేప పిల్లల పంపిణీకి సర్వం సిద్ధం.

జిల్లా మత్స్య శాఖ అధికారి బి లక్ష్మప్ప.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 6(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి బి లక్ష్మప్ప మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ఉచిత చేప పిల్లల పంపిణీ ని జిల్లాలోని 200 మత్స్యకారుల సహకార సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా యోగ్యమైన 1230 నీటి వనరులు అనగా గుర్తింపు పొందిన చెరువులు, కుంటలు మరియు రిజార్వాయర్ లకు 100శాతం రాయితీపై చేప పిల్లలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.కావున జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షలు మరియు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లేని గ్రామ పంచాయతీల కార్యదర్శులు ఈ నెల 9 తేదీ లోపు సంఘం తీర్మానాలు మరియు పంచాయతీ కార్యదర్శి ల గ్రామ తీర్మానాలు నీటి వనరుల పేర్లతో సహా తీర్మాణం జత చేసి నాగర్ కర్నూల్ జిల్లా మత్స్యశాఖ వారి కార్యాలయానికి పంపినచో అర్హతగల సంఘాలకు చేప పిల్లల ను పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.సమగ్ర వివరాలను మరియు వాట్సాప్ ద్వారా తీర్మానాలను పంపుటకు మత్స్యశాఖ కార్యాలయ క్షేత్రస్థాయి సిబ్బందిని సంప్రదించాలని ఆయన కోరారు.
సంప్రదించాల్సిన నెంబర్లు డి రాజ్ కుమార్ 9490304158, శ్రీకాంత్ 8186026003 వాట్సాప్ నెంబర్లకు తీర్మానాలను పంపవచ్చు అన్నారు.