ఉచిత వైద్య శిబిరం ప్రారంభం
శంకరపల్లి : విద్యార్థులు అరోగ్యం పట్ల జాగ్రతలు తీసుకోవాలని జిల్లా వైద్య అరోగ్యశాఖ అధికారి వెంకటపతి అన్నారు. మంగళవారం అయన శంకరపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఏఎల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థులు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంహెచ్‌ఓ నజీరుద్దీన్, హెచ్‌ఏఎల్ ప్రతినిధులు పాల్గోన్నారు.