ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): టిఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్, హైదరాబాద్ వారిచే నిర్వహించబడే యుపిఎస్సీ
సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ -2023 కొరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గల డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ ఎస్సీ , ఎస్టీ , బిసి , మైనారిటీ దివ్యాంగుల అభ్యర్థుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ సి.శ్రీధర్ తెలిపినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఆఫీసర్ దయానంద రాణి, ఎస్సీ స్టడీ సర్కిల్ -సూర్యాపేట హానరరి డైరెక్టర్ చిట్టిపాక రాములు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తి గల అభ్యర్థులు www.tsstudycircle.co.in వెబ్ సైట్ ద్వారా సెప్టెంబర్ 7 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.దరఖాస్తుదారుల వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించరాదని , ఏ ప్రభుత్వ ఉద్యోగం చేయరాదని,గతంలో ఎటువంటి ప్రభుత్వ కోచింగ్ తీసుకొని ఉండరాదని తెలిపారు.ప్రవేశ పరీక్షను సెప్టెంబర్ 18న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు.హాల్ టికెట్స్ సెప్టెంబర్ 12 నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అన్నారు.హాల్ టికెట్ లో పరీక్షా కేంద్రం పేరు తెలుపబడునని పేర్కొన్నారు.పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ , వరంగల్, నిజామాబాద్ నగరాలని తెలిపారు.ఇతర వివరాలకు టిఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కార్యాలయం 040-23546552 , హనరరీ డైరెక్టర్ సూర్యాపేట సెల్ నెంబర్ 9989129935 లలో సంప్రదించవచ్చని తెలిపారు.