ఉచిత హోమియో వైద్య శిబిరం
చిట్యాల12( జనం సాక్షి) మండలంలోని జూకల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఉచిత హోమియో వైద్య శిబిరం హోమియో వైద్యురాలు సునీత ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించి, వారికి హోమియో మందులు, ఆరోగ్యకర దీపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాధిక రాణి, మమత, స్వరూప, వీణా వాణి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.