ఉత్తమ్ కుమార్ రెడ్డి హయంలోనే నియోజకవర్గ అభివృధి.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొనతం వెంకటరెడ్డి

నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్.హుజూర్నగర్ నియోజకవర్గం రూపు రేఖలు మార్చి
అభివృద్ధి కి బాటలు వేసిన ఘనత ఉత్తంకుమార్ రెడ్డి మాత్రమే దక్కుతుందని నేటి పాలకుల మాటల్లోనే అభివృధి తప్ప,పనుల్లో అభివృద్ధి లేదని
నేరేడుచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొనతం చిన్న వెంకటరెడ్డి విమర్శించారు.నేరేడుచర్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే నేరేడుచర్ల చిన్న మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామని మాటలు చెప్పి,గెలిచి మూడేళ్లయిన ఏమాత్రం అభివృద్ధి పనులు చేయలేదన్నారు.నేరేడుచర్ల  మున్సిపాలిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి  కేటాయించిన 15 కోట్లు మున్సిపాలిటీ కౌన్సిల్ కి సంబంధం లేకుండా ఆనాటి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తో కలసి పబ్లిక్ హెల్త్ వారికి పనులు కేటాయించారు.మున్సిపాలిటీ అంతర్గత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గత 50 సంవత్సరాలుగా మూడు మండలాల రైతులకు ఉపయోగపడిన ఎన్ఎస్పి సబ్ డివిజన్ కార్యాలయాన్ని తరలించి వీధి వ్యాపారులకు ఉపయోగపడే విధంగా రెండు కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటుచేస్తామని ఆర్భాటంగా ప్రారంభించారు. పక్కా ప్లాన్ తోనే ఎమ్మెల్యే అనుకూల వ్యక్తి కి చెందేటట్టుగా కోర్టులో స్టే వేయించారు దీని వెనక ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసు అన్నారు. పురపాలక మంత్రి కేటీఆర్ తో రెండు సంవత్సరాల క్రితం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన అర్బన్ పార్క్ సైతం
అటకెక్కిందన్నారు. ఉత్తంకుమార్ రెడ్డి హయాంలోనే పట్టణంలో ,ఎస్ టి ,బి సి విద్యార్థులకు హాస్టల్ కు పక్కా భవనాలు నిర్మించామన్నారు.ఎమ్మెల్యేగా గెలిచి మూడు సంవత్సరాలు కావచ్చినప్పటికీ నేడు ఎస్సీ హాస్టల్ కి పక్కా భవనము నిర్మించలేకపోయారన్నారు. నేరేడుచర్ల పట్టణం లో జాతీయ రహదారి నిర్మాణంలో డివైడర్లు సెంట్రల్ లైటింగ్ ఎంపీ కుమార్ రెడ్డి చొరవ తోనే ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.మిర్యాలగూడ నుండి నేరేడుచర్ల మీదుగా కోదాడు వెళ్లే రైల్వే లైన్ కేంద్రంతో మాట్లాడి ఉత్తమ కుమార్ రెడ్డి ఏర్పాటు
చేస్తున్నరన్నారు.ఈ కార్యక్రమంలో
కౌన్సిలర్లు బచ్చలకూరి ప్రకాష్
రెడపంగ నాగయ్య,తాళ్ల రామకృష్ణారెడ్డి,పాల్వాయి కృష్ణమూర్తి, పిచ్చిరెడ్డి,ఖాదర్,
గజ్జల కోటేశ్వరరావు, మచ్చ శ్రీను,పాండు నాయక్,బెల్లంకొండ గోవింద్ గౌడ్,సతీష్,జాని,కొనతం నరసింహారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Attachments area