ఉత్తమ వారసత్వ నగరంగా వరంగరల్‌

పర్యాటన శాఖ అవార్డులు ప్రకటించిన చిరంజీవి
ఏప్రిల్‌ 12 నుంచి ప్రపంచ పర్యాటన సదస్సు
న్యూఢిల్లీ : ఉత్తమ వారసత్వ నగరంగా వరంగల్‌ బహుమతి గెలుచుకుంది. కేంద్ర పర్యాటక శాఖ అవార్డులను ఆ శాఖ మంత్రి చిరంజీవి ఈ రోజు ఢిల్లీలో ప్రకటించారు. 36 కేటగిరుల్లో ఉత్తమ అవార్డులు పొందాన 86 మంది జాబితాను మంత్రి విడుదల చేశారు. ఉత్తమ సాముదాయక పర్యాటక రాష్టాలుగా తొలిస్థానం ఆంద్రప్రదేశ్‌, రెండో స్థానం రాజస్థాన్‌ ,మూడో స్థానం గుజరాత్‌ గెలుచుకోగా, ఉత్తమ పౌర గుర్తింపు నిర్వాహక నగరంగా జీహెచ్‌ఎంసీ బహుమతులు గెల్చుకున్నాయి. ఏప్రిల్‌ 12 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో ప్రపంచ పర్యాటక సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి చిరంజీవి తెలిపారు. సరస్సును అడ్డుకొనేందుకే హైదరాబాదులో బాంబు పేలుళ్లు జరిపారని, ఇలాంటి సంఘటనలు ప్రపంచ పర్యాటక సదస్సుకు ఆపలేవని ఆయన పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో సదస్సును విజయవంతం చేయడమే అటువంటి దాడులకు సరైన సమాధానమన్నారు.