ఉత్తమ సేవా పథకాలు అందుకున్న పోలీస్ అధికారుల 

– అంకితభావంతో  నిజాయితీ గా విధులు నిర్వహించే అధికారులకు తప్పకుండా గుర్తింపు వస్తుంది.
– హోం శాఖ శాఖమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర డిజిపి యం. మహేందర్ రెడ్డి ఐపీఎస్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పతకాలు అందుకున్నారు.
సిద్దిపేట బ్యూరో 03,జూన్ ( జనం సాక్షి )
ఉత్తమ సేవా పతకాలు పొందిన అధికారులకు శుక్రవారం రోజున హోం శాఖ మరియు జైళ్ల శాఖ  మంత్రివర్యులు మహమూద్ అలీ,  రాష్ట్ర డిజిపి యం. మహేందర్ రెడ్డి ఐపీఎస్ కలసి హైదరాబాద్ పట్టణం రవీంద్రభారతిలో ఉత్తమ సేవా పతకాలు అందజేశారు. సిద్దిపేట జిల్లా నుండి  ఉత్తమ సేవా పథకాలు అందుకున్న పోలీస్ అధికారుల వివరాలు.
1. ఎస్. మహేందర్, అడిషనల్ డిసిపి అడ్మిన్, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్.
2. కె. రామచంద్ర రావు, ఏఆర్ అడిషనల్ డిసిపి, సిఎఆర్ హెడ్  క్వార్టర్స్ సిద్దిపేట్.
3. సిహెచ్ఆర్వి ఫణీంద్రర్ శర్మ, సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి.
4. పి. రామకృష్ణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్, సిఏ ఆర్ హెడ్ క్వార్టర్ సిద్దిపేట.
5. కృష్ణంరాజు, ఏఎస్ఐ జగదేవపూర్, (మహోన్నత సేవా పథకం)
6. అంజయ్య, ఏఎస్ఐ కొమురవెల్లి.
7. పి సంగమేశ్వర్ గౌడ్, రిటైర్డ్ ఎస్ఐ.
8. పి హనుమంతరావు, రిటైర్డ్ ఏఎస్ఐ
2019, 2020 మరియు  2021 సంవత్సరంలో ఉత్తమ సేవా పతకాలు పొందిన అధికారులకు శుక్రవారం రోజున అందజేయడం జరిగింది, ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత,  మాట్లాడుతూ డిపార్ట్మెంట్లో అంకితభావంతో నీతి నిజాయితీ గా విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి ఏదో ఒక రోజు తప్పకుండా గుర్తింపు వస్తుందని తెలిపారు, ఉత్తమ సేవ పథకాలు అందుకున్న అధికారులు మరింత రెట్టింపు ఉత్సవంతో విధులు నిర్వహించి  పోలీస్ డిపార్ట్మెంట్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.