ఉత్తరాఖండ్‌ బాధితులకు అవార్డు అంకితమిచ్చిన

శిఖర్‌ ధావన్‌

ఢిల్లీ : ఛాంపియన్స్‌ ట్రోఫిలో అద్భుత ఫామ్‌తో బ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత క్రికెటర్‌ శిఖర్‌ థావన్‌ తన మంచి మనసును చాటుకున్నాడు. తనకు లభించిన మ్యాన్‌ ఆఫ్‌ ది సిరిస్‌ అవార్డును ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారికి అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. నా ఆట తీరును వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి అంకితం చేయాలనుకుంటున్నాను. వారి కోసం ప్రార్థిస్తున్నాను అని ధావన్‌ ప్రకటించాడు. ఇక యువరాజ్‌ సింగ్‌ తన ఆటతీరును ఢిల్లీ అత్యాచారానికి మనోజ్‌ తివారీ వెస్టిండిస్‌ పై సాధించిన మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును కోల్‌కతా ఆసుపత్రి అగ్ని ప్రమాద బాధితులకు అంకితం చేశారు.

భారత క్రికెటర్లు తమ మంచి మనసును చాటుకుంటున్నారు.