ఉత్తరాదిలో భూ ప్రకంపనలు

న్యూఢిల్లీ,మే9(జ‌నం సాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌-తజకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతంలో బుధవారం సాయంత్రం 4.11 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.2గా నమోదైంది. భూకంపం ప్రభావంతో ఉత్తర భారతంలోని పలు చోట్ల ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ వంటి ప్రాంతాలో ప్రకంపనలు సంభవించాయి. జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌ సహా రాష్ట్రంలోని పలు చోట్ల ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు వార్తలు అందాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కజ్జియార్‌, కులు, సిమ్లాలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆప్ఘనిస్థాన్‌-తజకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్‌ సర్వే ప్రకటించింది.