ఉత్తరాదిలో మళ్లీ గాలివాన బీభత్సం

న్యూఢిల్లీ, మే16(జ‌నం సాక్షి) : ఉత్తరాదిలో మళ్లీ గాలివాన బీభత్సం సృష్టించింది. అనూహ్య వాతావరణ పరిస్థితులు అక్కడి జనజీవనాన్ని స్తంభింపచేశాయి. బుధవారం 
ఉదయం కూడా ఢిల్లీలో భారీ స్థాయిలో గాలివాన వచ్చింది. పెనుగాలులకు నగరంలోని కొన్ని ప్రాంతాలు వణికిపోయాయి. ఢిల్లీతో పాటు సవిూప ప్రాంతాల్లో ఇదే రకమైన వాతావరణం ఉంటుందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. నారనౌల్‌, అల్వార్‌, రోహతక్‌, జింద్‌, భివాని, జాజర్‌, రెవారి, నుహ్‌, పల్వాల్‌ ప్రాంతాల్లోనూ వాతావరణం భయానకంగా ఉన్నది. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ఇవాళ ఉదయం తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా స్థానిక ప్రజలకు వార్నింగ్‌ ఇచ్చింది. పవర్‌ లేదా టెలిఫోన్‌ లైన్ల వద్ద ఎవరూ ఉండరాదు అని హెచ్చరించింది. మే 13వ తేదీన కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ గాలివాన పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.