ఉద్థృతంగా ప్రవహిస్తున్న గోదావరి
మహదేవ్పూర్: కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలం కాళ్లేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నిన్న రాత్రి నుంచి వరద ఉద్థృతి పెరుగుతుండటంతో మండలంలోని 20 గ్రామలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పత్తి, వరి పంటలు నీట మునిగాయి. లొతట్టు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.