ఉద్దేశ పూర్వకంగా సీపీఐ నాయకునిపై కేసులు పెట్టి జైలుకు పంపిన అలంపూర్ ఎస్సై ని సస్పెండ్ చేయాలి : సీపీఐ డిమాండ్

 

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 10 : అన్ని పార్టీలు,సంఘాలు కలసి కార్యక్రమం చేస్తే సీపీఐ పెద్దబాబునిమాత్రమే పిలిచి రిమాండ్ చేయడం తగదని అన్నారు
పోలీసులు ప్రజలకోసం పోరాడే నాయకులపై పగ తీర్చుకోవాలనుకోవడం దుర్మార్గం, ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని ఈ సంఘటనపైనపై పార్టీలో చర్చించి మానవహక్కుల సంఘానికి, డిజిపి కి కూడా పిర్యాదు చేసేందుకు పరిశీలిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ ఎస్ ఐ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
బుధవారం నాడు సీపీఐ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడారు.ఈసందర్బంగా అయన మాట్లాడుతూ అలంపూర్ లో నిన్న సెలవు దీనమని తెలిసి కావాలనే కేసుల్లో ఉన్న అనిపార్టీల నాయకులను పిలవకుండా సీపీఐ పెద్దబాబుని మాత్రమే పిలిచి సాయంత్రం వరకు స్టేషన్లో ఉంచుకొని రాత్రి మేజిస్ట్రేట్ దగ్గర హాజరు పరచి 11గంటలకు జైలుకు తరలించడమంటే ఉద్దేశ పూర్వకంగా కాకపోతే మరిఏమనాలి.
జిల్లాలో అనేక గొడవల్లో నెత్తులు పగిలిన కేసుల్లో కూడా స్టేషన్ బెయిల్ ఇస్తుంటే ఉద్యమకారుల పైన (సీపీఐ నాయకుని) పై మాత్రం నాన్ బైలేబుల్ కేసులు పెట్టి రిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమో పోలీస్ ఉన్నంత అధికారులు దీనిపై అలోచించి స్పందించాలన్నారు. అధికార పార్టీ నాయకులు తిట్టినా అనుమతిలేకుండ కార్యక్రమాలు చేసిన ఏమి అనని పోలీసులు సమస్యల పై పోరాడే వారిపై ప్రతాపం చూపడం సమాజానికి ఎలాంటి సంకేతం ఇస్తుందో ఆలోచించాలన్నారు.ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యలో మంచిది కాదన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు ప్రజా సమస్యల కోసమే పోరాడుతాయన్నారు. కావాలని చేయమన్నారు ఇంకా పోలీస్ అధికార్లే సహకరించాలన్నారు.
ఎమ్మెల్యే చెప్పాడనో ఎస్సై ని ప్రశ్నించాడనో కేసులు చేయడం పోలీస్ శాఖకు మంచిది కాదని, ఇలాంటివి ప్రజలతో సత్సంబంధాలు లేకుండా పోలీసులంటే గౌరవం లేకుండ పోతుందన్నారు.దయచేసి ఇప్పటికైనా ఎస్ ఐ పై చర్యలు తీసుకోని ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరముందని తెలిపారు. సిపిఐ జిల్లా నాయకులు కృష్ణ, ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రంగన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న, ఇన్సాఫ్ జిల్లా నాయకుడు గూడు శాబ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు వెంకటేష్, హనుమేష్, రైతు సంఘం జిల్లా నాయకులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు