ఉద్యోగాల భర్తీపై శ్వేత పత్రం విడుదల చేయండి

3

– కోదండరాం

హైదరాబాద్‌,ఆగస్టు 4(జనంసాక్షి):ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. ఉపాధి కల్పన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగాలపై ఏటా క్యాలెంటర్‌ విడుదల చేయాలన్నారు. తరవాత ఏయే ఉద్‌యోగాలు ఎన్ని భర్తీ చేశారో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలియాలన్నారు. చిన్న కాంట్రాక్టులు కూడా బడా బాబులకే ఇస్తున్నారన్నారు. ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చేందుకు ఉద్యమాలు చేస్తామని కోదండరామ్‌ స్పష్టం చేశారు.