మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ ఇదీ..
హైదరాబాద్ (జనం
సాక్షి) : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ నేటి నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.



