ఉద్రిక్తతకు దారితీసిన విద్యార్థి సంఘాల ఆందోళన
వరంగల్: వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్‌లో ర్యాగింగ్ ను ఆరికట్టాలని డిమాండ్ వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఏబీవీపీ, టీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు డైరెక్టర్ ఛాంబర్‌లోకి దూసుకెళ్లి ఓ అధ్యాపకునిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్ధి సంఘాలకు మధ్య తోపులాట జరిగింది. నిట్ విద్యార్థులు తమ సమస్యను తామే పరిష్కరించుకుంటామాంటూ బయటి విద్యార్ధి సంఘాలు వెళ్లిపోవాలని డిమాండ్ వ్యక్తం చేయడంతో ఇరువర్గాలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు జ్యోకం చేసుకుని ఆందోళనకారులను అరెస్టు చేశారు.