ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయం అందజేయండి.
దేవనూర్ గ్రామానికి చెందిన సి. వెంకటయ్య.
తాండూరు జూన్ 13(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా యాలాల మండలం దేవనూర్ గ్రామానికి చెందిన సి. వెంకటయ్య తన కూతుర్లు సాయికీర్తన, పావణీ ఇద్దరినీ ఉన్నత చదువులు చదివించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయన కష్టపడాలని తన కూతుళ్లను ఉన్నత చదువులు చదివించాలని కోరిక ఉన్నప్పటికీని తనకు అంగవైకల్యం నిరాశ కల్పస్తూంది. అంగవైకల్యం ఉన్నప్పటికిని ఏదో విధంగా తన ఇద్దరు కూతుళ్లను ఉన్నత చదువులు చదివించాలని
లక్ష్యంతో ఉన్నారు. ఏ పనులు చేయాలన్నా అంగవైకల్యం అడ్డు పడుతుంది. చేసేది ఏమీ లేక దాతల సహకారంతో తన ఇద్దరు కూతుళ్లను ఉన్నత చదువులు చదివించాలని
(జనం సాక్షి మీడియా ప్రథినిది) తో కోరారు.
ప్రస్తుతం సాయికీర్తన క్రీడా రంగంలో డీల్లిలో నిర్వహించే ఇంటర్ నేషనల్ ట్రయల్స్ కు ఎంపిక అయ్యారు.కాని ఆర్థిక పరిస్థితి నెలకొంది.
ఈ సందర్భంగా సి వెంకటయ్య మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి కారణంగా 10వ తరగతి వరకు
ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించానని తెలిపరు. తాను ఎలాగో చదువుకో లేనని తన కూతుర్ల నైనా ఉన్నత చదువులు చదివించాలని ప్రదేయ పడుతున్నట్లు పేర్కొన్నారు. తన ఇద్దరు కూతుర్లు చదువులో చక్కగా రాణిస్తున్నారని ఇక పై ఉన్నత చదువులు చదవాలంటే ఆర్థిక పరిస్థితి ఎదురు కావడంతో చేసేదేమీలేక నిచ్చయస్థితిలో ఉన్నట్లు తెలిపారు. దాతలు ముందుకు వచ్చి తమ ఇద్దరు కూతుళ్లకు ఉత్త చదువులు చదివించాలని విజ్ఞప్తి చేశారు.
Attachments area