ఉన్నత విద్యా పేద విద్యార్థికి కలగానే మిగులుతుంది
కరీంనగర్:(టౌన్) ఈ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రతినిధుల సమావేశం నగరంలటోని ఫిలింభవన్‌లో జరిగింది. ఈ సమావేశానికి ఏఐఎస్‌బీ రాష్ట్ర కమిటీ కన్వీనర్ కామ్రెడ్ బండ సురెందర్ రెడ్డి హాజరయి సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం కార్పొరెట్ సంస్థలతో కుమ్మక్కై విద్యా వ్యవస్థను ప్రైవేఠీకరణ చేయాలన్న దురుద్దేశంతో ఉందని, ఉన్నత విద్యా పేద విద్యార్థికి కలగానే మిగులుతుందని విద్యార్థులందరికి ఉపకార వేతనాలు అందించాలని అన్నారు. ప్రధాన వక్త రాష్ట్ర కన్వీనర్ తేజ్‌దీప్‌రెడ్డి మాట్లాడుతూ ల్లాలో ఖాఋగా ఉన్న వార్డెన్, 4వ తరగతి ఉపాధ్యాయ పోస్టులను భర్తి చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 116 అమలు చేసి విద్యార్థులకు ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని, జీవో నెం 126,75,64ల ప్రకారం అన్ని సౌకర్యాలకు నిధుల పెంచాలని కొత్తగా ఏర్పాటయినా ప్రతి యూనివర్శిటికి 200కోట్లు కేటాయించాలని మఖ్యంగా సుభాస్ చంద్రబోస్ జన్మదినం జనవరి 23న ‘దేశ్‌ప్రేమ్‌దివాస్’ గా ప్రకటించి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.