ఉపరాష్ట్రపతిగా హమీద్ అన్సారీ విజయం
ఢిల్లీ: ఉప రాష్ట్రపతిగా యూపీఏ అభ్యర్ధి హమీద్ అన్సారీ విజయం సాధించినట్లు లోక్ సభ సెక్రెటరీ జనరల్ విశ్వనాధన్ ప్రకటించారు. 490 ఓట్లతో అన్సారీ ప్రత్యర్థి జశ్వంత్‌సింగ్ పై విజయం సాధించారు. అన్సారీకి 490 ఓట్లు రాగా జశ్వంత్‌సింగ్‌కు 238 ఓట్లు వచ్చాయి. పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్య 788 కాగా ఓటు హక్కు వినియోగించుకున్నవారు 736 మంది. మన రాష్ట్రం నుంచి తెదేపా ఎంపీల 11 మంది, తెరాస ఎంపీలు ఇద్దరు, వైకాపా ఎంపీ ఒకరు ఈ ఎన్నికలో పాల్గొనలేదు. వరుసగా రెండోసారి హామీద్ అన్సారీ ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన అన్సారీని పలువురు అభినందనలు వెల్లువలో ముంచెత్తుతున్నారు.