ఉపాధి కూలీలకు ఎండల నుంచి రక్షణ
కామారెడ్డి,మే3(జనంసాక్షి): జిల్లాలో ఉపాధి హావిూ పనులకు వచ్చే వారికి తగిన రక్షణ చర్యలు కల్పిస్తున్నామని డీఆర్డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఈ యేడు 13లక్షల 13వేల 320 మందికి పని దినాలు కల్పిస్తున్నామని అన్నారు. వీరికి 18 కోట్ల 3లక్షల రూపాయలు చెల్లించామన్నారు. జిల్లాలో 86 వేల 847 కుటుంబాలకు ఉపాధిహావిూలో పనులు కల్పిస్తూ ప్రతినిత్యం లక్షా 30 వేల మంది కూలీలు పనులు చేస్తున్నారన్నారు. వీరికి వేసవికాలంలో తాగునీరు, నీడ, ఆరోగ్య కిట్టు, ఏర్పాటు చెశామని అన్నారు. ఆరోగ్యంగా ఉన్న వారు మాత్రమే పనులకు హాజరు కావాలని కోరారు. జిల్లాలో నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను సంరక్షించాలని చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లాలో 431 ఉపాధిహావిూ, 95 అటవీ శాఖ నర్సరీలు ఏర్పాటు చేశామని అన్నారు. వీటిలో 348 లక్షల మొక్కల పెంపకం కొనసాగిస్తున్నామన్నారు. నర్సరీల్లో నీటి సౌకర్యం లేకుంటే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ట్యాంకర్, 500 విూటర్ల లోపు ప్రైవేటు బోరు ఉంటే అద్దెకు తీసుకోవాలన్నారు.