ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం: బాబు

మహబూబ్‌నగర్‌: జాతీయ ఉపాధి హామి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించే పాలన తెచ్చింది. తెదేపానేనని ఆయన చెప్పారు. ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధర దక్కే పరిస్థితిలేదని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎవరికీ న్యాయం చేయలేదని చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని పదేపదే చెప్పానని చంద్రబాబు మరోసారి గుర్తుచేశారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘ వస్తున్నా… మీ కోసం ‘ పాదయాత్ర మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొనసాగుతోంది కోయిల్‌కొండ మండలం అంకిళ్ల నుంచి యాత్రను చంద్రబాబు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతానికి కోయిల కొండ చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పెద్దసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు ఇవాళ్లి పాదయాత్రలో పాల్గొన్నారు.

తాజావార్తలు