ఉపాధ్యాయుడు సొంత ఖర్చులతో నోటుబుక్కులు పంపిణీ

పెద్దవంగర అక్టోబర్ 21(జనం సాక్షి )బొమ్మకల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల దాతృత్వం
సొంత ఖర్చులతో 5 వేయి లు విలువ చేసే టై,బెల్ట్ ల అందజేశారు.
శుక్రవారం బొమ్మకల్ గ్రామంలో ని పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు సొంత ఖర్చులతో 70 మంది విద్యార్థులకు 5000 రూపాయలతో టై,బెల్ట్ లను చిట్యాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మడిపెద్ది వెంకన్న చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకన్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవ గుణాన్ని కలిగి ఉండి సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.పాఠశాల సిబ్బంది పాఠశాలకు చేస్తున్న సేవలను ప్రశంసించారు మరియు వారి సేవ గుణాన్ని అభినందించారు.అనంతరం రాష్ట్ర విద్యా శాఖ ఇటీవల ప్రారంభించిన తొలిమెట్టు అమలు కార్యక్రమాన్ని మరియుఉపాధ్యాయుల బోధనను.పరిశీలించారు..అనంతరం ఉపాధ్యాయుల సమావేశం లో మాట్లాడుతూ అందరూ పాఠ్య ప్రణాళికలు రూపొందించుకొని,తగిన టీ ఎల్ ఎం ఉపయోగిస్తూ విద్యార్థులకు పాఠాలు బోధించాలని,విద్యార్థులందరూ సాధించాల్సిన కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించేలా ఉపాద్యాయులు కృషి చేయాలని అన్నారు. కృత్యాధార పద్దతి లో బోధించాలని సూచించారు.ప్రతి విద్యార్థి పై దృష్టి పెట్టాలన్నారు.
సమావేశంలో ప్రధానోపాధ్యాయులు పూసల శిరీష, పాఠశాల విద్య కమిటీ చైర్మన్ బాసబోయిన ఉపేందర్, ఉపాధ్యాయులు లావణ్య,స్రవంతి,సి ఆర్ పి రంగన్న,విద్యార్థులు పాల్గొన్నారు