ఉపాధ్యాయుల చొరవతో ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ
పాఠశాలకు వితరణ చేసిన వారిని అభినందించిన ఎంఈఓ
టేకులపల్లి, అక్టోబర్ 15( జనం సాక్షి): సహృదయంతో మంచి సంకల్పంతో ఎవరు చేసిన అభివృద్ధి ఫలితాలను ఇస్తుందని ఇక్కడ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు ఏమాత్రం తగ్గకుండా సమకూర్చుకున్న విధానాన్ని చూస్తే అక్కడ పనిచేసే ఉపాధ్యాయులను అభినందించక తప్పదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,టేకులపల్లి మండలం, రాంపురం పంచాయతీలోని ఎంపీపీ ఎస్ ముత్యాలంపాడు( హెచ్ సి ) నందు విద్యార్థుల పేరెంట్స్,గ్రామస్తుల సహకారంతో సమకూర్చుకున్న వస్తువుల వితరణ లను చూస్తే కార్పొరేట్ పాఠశాలకు ఏమాత్రం తీసిపోదని చెప్పుకోవచ్చు. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు లాకావత్ లక్ష్మణ్, కే ప్రసాద్ లు విద్యార్థులతోనే కాకుండా వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఆ పరిధిలో గల ప్రజాప్రతినిధులతో మమేకమై పాఠశాలలో ఉన్నటువంటి పేరెంట్స్ కమిటీ మీటింగ్ ల ద్వారా వారి దృష్టికి తీసుకువెళ్లి పాఠశాలకు కావలసిన వాటిని గురించి సమకూర్చుకోవడానికి వారి సహాయ సహకారాలు తీసుకుంటూ పాఠశాలను అభివృద్ధి పరచడంలో ఎంతో కృషి చేస్తుంటారు. శనివారంజరిగిన పేరెంట్స్ మీటింగ్ లో అదే గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు భూక్య మంజిలాల్ పాఠశాలకు కావలసిన రెండు స్పీకర్ బాక్స్ లు,యాంప్లీ ఫైర్,రెండు వైర్లెస్ మిక్(మౌత్)లను అందించారు. గతంలో కూడా పాఠశాలకు 5000 రూపాయలు ఇచ్చినందువల్ల మంజిలాల్ ను ఏర్పాటుచేసిన పేరెంట్స్ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి రామ్ సింగ్ ఠాకూర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎం ఈ ఓ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలోనే కొత్త పాఠశాల భవనాన్ని విద్యార్థులకు అందించిన ఎంపీటీసీ బానోతు సరోజకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నెల క్రితం పాఠశాలకు కావలిసిన టీవీ ని అంద�