.*ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలి*

 టిఎస్ యుటిఎఫ్  జిల్లా ఉపాధ్యక్షులు  శ్రీనివాస్ రెడ్డి
కోదాడ, ఆగస్టు 22(జనంసాక్షి)
 ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలని టీఎస్ యుటిఎఫ్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని ద్వారకుంట నల్లబండగూడెం రెడ్ల కుంట కూచిపూడి అల్వాల పురం టీబీ పాలెం లక్ష్మీపురం గ్రామాలోని  పాఠశాలల్లో  టీఎస్ యుటిఎఫ్ సంఘ సభ్యత్వం  సేకరించి మాట్లాడారు. గత ఎనిమిదేళ్లుగా ఉపాధ్యాయులకు  బదిలీలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అన్ని శాఖల్లో  పదోన్నతులు పూర్తిచేసిన విద్యాశాఖ ఉపాధ్యాయులకు  మాత్రం నేటి వరకు పదోన్నతులు చేపట్ట లేదన్నారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై టీఎస్ యుటిఎఫ్ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్రంలో అగ్ర స్థానంలో నిలిచిందన్నారు. పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఉపాధ్యాయులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎన్ నాగేశ్వరరావు, కోదాడ మండలం టీఎస్ యుటిఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు బి పిచ్చయ్య, మాతంగి శ్రీనివాస్,పులి మైసయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు