ఉపాధ్యాయుల బదిలీలు ప్రారంభం
ఆదిలాబాద్, జూన్ 21: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదలీల షెడ్యూల్ విడుదల చేయడంతో జిల్లాలో ఉపాధ్యాయుల బదలీల జాతర గురువారం నుండి ప్రారంభమైంది. ఆన్‌లైన్ ద్వా రా ఉపాధ్యాయులు దరఖాస్తు ఈ నెల 26వ తేదీన చేసుకోవచ్చు ఈ నెల 27న సీనియార్టి జాబిత విడుదల 28, 29 తేదీల్లో అభ్యంతరాలను స్వీకరణ ఈ నెల 30 నుంచి జూలై 2వ తేదీ వరకు జాబిత పరీశిలన, జూలై 3 నుండి 8వ తేదీవరకు బదలీల కౌన్సెలింగ్ ప్రక్రియ సాగుతుంది ఈ బదలీలలో సుమారు 6 వేల మంది ఉపాధ్యాయులకు అవకాశం కలగనుంది. దాదాపుగా 3 వేలకు పైగా ఉపా ధ్యాయులకు స్థానభ్రంశం కలగనుందని అధికారుల అంచనా. ఉపాధ్యాయ బదలీ షెడ్యూల్‌తో జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది పనుల్లో నిమగ్నమయ్యారు