ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
వేములవాడ జులై 29 (జనంసాక్షి)
సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రమోషన్లు బదిలీలను చేపట్టాలి అని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ వేములవాడ రూరల్ అర్బన్ మండల శాఖ ప్రతినిధులు డిమాండ్ చేశారు. టిపిటీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున వేములవాడ అర్బన్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి ఉపాధ్యాయుల సమస్యలపై వివరాలు సేకరించారు ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులతో పాటు జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సందర్శించి అక్కడ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ దానికి అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది అని వెంటనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని పాఠ్యపుస్తకాలను పూర్తిస్థాయిలో విద్యార్థుల కు అందజేయాలని కోరారు, అనేక సంవత్సరాలుగా ప్రమోషన్లు లేక బదిలీలు చేపట్టకపోవడం వల్ల ఉపాధ్యాయుల బాధలు వర్ణనాతీతంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టిపిటీఎఫ్ వేములవాడ ప్రతినిధులు చకినాల రామచంద్రం, విక్కుర్తి అంజయ్య ,బొజ్జ కృష్ణ, చింతపంటి బాలరాజు, విక్కుర్తి అశోక్, పొన్నం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.