ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడమే పిఆర్టీయూ లక్ష్యం – అధ్యక్షులు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్

మునిపల్లి, ఆగష్టు 10, జనంసాక్షి :

ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే పీఆర్టియూ లక్ష్యమని పిఆర్టియు మండల అధ్యక్షులు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్ అన్నారు. 2023 సంవత్సరానికి గాను సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని అన్నారు. గురువారం నాడు మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శించి టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు చంద్రమౌళి మాట్లాడుతూ ప్రస్తుతం ఉపాధ్యాయలు పొందుతున్న సౌకర్యాలు పిఆర్టీయూ సంఘ కృషితోనే సాధ్యం అయ్యాయని, సమస్యల పరిష్కారానికి ప్రధాన కారణం రాష్ట్రవ్యాప్తంగా సంఘానికి ఉపాధ్యాయులు అందిస్తున్న సహకరమేనని అన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా 70 వేల సభ్యత్వం అందిస్తూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ముందడుగు వేయడానికి సహకరిస్తున్న ప్రాథమిక సభ్యులకు కృతజ్ఞతలు చెప్పారు. అతి త్వరలోనే సీపీఎస్ రద్దు, ప్రమోషన్ లతో కూడిన బదిలీలతో పాటు మధ్యంతర భృతి, పిఆర్సీ ఇప్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల కార్యవర్గ నాయకులు వీరన్న, రాజేశ్వర్, శ్రీకాంత్, సుజాఉద్దీన్, సిద్దేశ్వర్, ప్రవీణ్ కుమార్, రమేశ్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తాజావార్తలు