ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కై తపస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ తపస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దత్తాత్రి

జహీరాబాద్ జులై 19 (జనం సాక్షి) తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో జహీరాబాద్ మండలం లోని రంజోల్, హుగ్గేల్లి, భరత్ నగర్, పస్తాపూర్, దిడ్గి,కొత్తూరు, బూర్థిపాడు, బూచినెల్లి, పాఠశాలల్లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి తపస్ జిల్లా అధ్యక్షులు దత్తాత్రి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తొలగిపోతాయనీ, అనుకున్నాము. కానీ నేటి వరకు కూడా విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలేవీ పరిష్కారం కాలేదు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కనీసం బదిలీలు ప్రమోషన్లుసరిగా జరపడం లేదు.317 జీవో ద్వారా అనేకమంది ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిన విషయాలను అనేకసార్లు అధికారుల దృష్టికి, విద్యాశాఖ మంత్రి ని కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తులు చేసినప్పటికీ నేటి వరకు ఎలాంటి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో జీతాలు ఒకటో తారీకు రాకపోవడం అనేక రకాలైన బిల్లులు పెండింగ్ లో ఉండడం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా 2002,2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయుటకు ఆగస్టు 31 చివరి తేదీగా ఉన్నప్పటికీ అమలుకుచేయుటకు నిర్ణయం తీసుకోలేదు. సి పి ఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసినా అలసత్వం చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వము వైఖరిని నిరసిస్తూ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం”ఉద్యమ కార్యాచరణ” ప్రకటించడం జరిగిందని అన్నారు.జులై 22 వరకు కాంప్లెక్స్ స్థాయిలో సంతకాల సేకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కి అందజేయడం. 25 నాడు మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమము. 31 నాడు:ఆర్డీఓ అధికారులకు వినతి పత్రాలు అందజేయడం. 5 నాడు : జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా. 19 నాడు: రాష్ట్ర స్థాయి మహా ధర్నా ఇందిర పార్క్ వద్ద కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ .కార్యక్రమంలో తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బస్వరాజ్, రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి నరసింహారెడ్డి, జహీరాబాద్ మండల అధ్యక్షులు శ్రీపాల్, మండల ఉపాద్యక్షులు, శ్రీకాంత్,అంజయ్య, ఈశ్వర్, మోహన్ రెడ్డి, జైపాల్, సిద్దన్న,మల్లయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.