ఉప్పల్‌ స్టేడియం వద్ద ట్రాఫిక్‌ జాం

హైదరాబాద్‌, జనంసాక్షి:  ఉప్పల్‌ స్టేడియం వద్ద భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. ఇవాళ ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఈ సందర్భంగా క్రికెట్‌ అభిమానులు భారీగా స్టేడియానికి తరలి వచ్చారు. క్రికెట్‌ అభిమానులు తమ వాహనాలను ఉప్పల్‌ ప్రధాన రహదారిపైనే పార్కింగ్‌ చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.